Tuesday, November 12, 2024
spot_img

రోడ్డు ప్రమాదాల పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ శంకర్

Must Read

ఏసీపీ జీ.శంకర్ రాజు ఆధ్వర్యంలో తపస్య జూనియర్ కాలేజీ మరియు ఖిల్వత్ విద్యార్థులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశం పై సిబ్బందితో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏసీపీ జీ.శంకర్ మాట్లాడుతూ హైదరాబాదులో 2023లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు 523,382 మంది పై కేసులు బుక్ అయ్యాయని తెలిపారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 86 శాతం పెరిగిందని అన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5000 వరకు జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు అని తెలిపారు.నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడుపుతూ అనేక నేరాలకు,దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు . ప్రతి వాహనానికి నంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని,లేనిపక్షంలో సెక్షన్ 80 (ఎ) 177 ఎంవీ ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు ఎక్కువగా యువత ఓవర్ స్పీడ్ ,రాంగ్ రూట్ ,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు అని అన్నారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడే ఆయుధం అని తెలిపారు. 2023 నాటికి హైదరాబాద్లో దాదాపు 56.9 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయని,అందులో 18 లక్షల మందికి పైగా హెల్మెట్ ధరించలేదని తెలిపారు.ఎల్లప్పుడూ పూర్తి ముఖం గల హెల్మెట్ని కొనుగోలు చేయాలని కోరారు.వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అని తెలిపారు.చాలా మంది యువత అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా విద్యార్ధులు ఈ వయసు నుంచే పట్టుదల, కృషి, ఆత్మ విశ్వాసం అలవర్చుకోవాలి సూచించారు. వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు.ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్ధులు మరియు కాలేజీ ప్రిన్సిపాల్ తబస్సుమ్ ఫాతిమా,వైస్ ప్రిన్సిపాల్- సిద్దు, సిబ్బంది మరియు ఫలక్నుమా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, మహమ్మద్ అయాన్-పీసీ & శ్రీ.కృష్ణ, హెచ్.జి అధికారి (టి.టి.ఐ బేగంపేట) & హీరో మోటార్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS