Sunday, May 18, 2025
spot_img

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి ఎన్‎కౌంటర్, మావోయిస్టు మృతి

Must Read

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది. బుధవారం బీజాపూర్ జిల్లా గంగ్లూరు పోలీస్‎స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఎన్‎కౌంటర్ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‎కౌంటర్‎లో ఒక మావోయిస్టు మరణించాడు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి. ముంగా గ్రామంలో మావోయిస్టులు భేటీ అయ్యారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రత బలగాలు , మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.

ఘటన స్థలం నుండి 09 ఎంఎం పిస్టల్‎తో పాటు, మావోయిస్టులకు సంబంధించిన ఇతర వస్తువులను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS