Monday, November 4, 2024
spot_img

పనులలో రాజీ పడొద్దు..

Must Read
  • రింగ్ రోడ్డు పనులకు త్వరలో పరిష్కరిస్తాం.. ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉండొద్దు..
  • త్వరలో రేషన్ కార్డుల జారీ.. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ..
  • రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహణ..
  • రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..

కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో చేపట్టబోయే పనుల్లో ఎక్కడకూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హుజూర్ నగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కోదాడ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలసి రోడ్లు మరియు భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో రెండు నియోజక వర్గాల్లో చేపట్టే పనులు, జరుగుతున్న పనులు అలాగే కొత్త పనుల ప్రతిపాదనపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 85 పనులకు రెండు నియోజకవర్గాలలో కొత్త పనులు, రెన్యూవల్ పనులకు రూ. 124.65 కోట్లు నిధులు చేయడం జరిగిందని అన్నారు.

నియోజక వర్గాల్లో త్వరలో చేపట్టే పి.ఆర్. పనుల్లో ఎక్కడకూడా రాజీ నాణ్యత ప్రమాణాలతో ఉండాలని నిర్దేశించిన సమయానికి పనులు అందించాలని సూచించారు. అదేవిదంగా ఆర్ అండ్ బి శాఖ ద్వారా హుజూర్ నగర్ నియోజక వర్గం లో 35 రహదారుల నిర్మాణం కొరకు రూ. 267 కోట్లు అలాగే కోదాడ నియోజక వర్గంలో 7 పనులకు రూ. 156 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖ ద్వారా రెండు నియోజక వర్గాల్లో రెండు పవర్ ట్రాన్సఫరాల ఏర్పాటుకు రూ.15 కోట్లు అలాగే రెండు సబ్ స్టేషనల్ ఏర్పాటుకు 5 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అదేవిదంగా ఆదనవు ట్రాన్సఫరాల ఏర్పాటుకు రూ. 1.8 కోట్లు అలాగే విద్యుత్ కెపాసిటీ పెంచుటకు రూ. 1.7 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. అలాగే 133 కె.వి ఇంటర్ లింకింగ్ లైన్ కొరకు రూ. 1.92 కోట్లు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. రైతులకు, గృహాలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరం అందించాలని , ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

మెల్లచేరువు రామాపురం,కోదాడ లో షాదీఖాన స్థల పరిశీలన చేయనున్నట్లు అలాగే స్థానికంగా రింగ్ రోడ్డు పనుల కేసు పతిష్కరించే విదంగా చర్యలు తిసుకుంటామని, టౌన్ హాల్ ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. కోదాడ నియోజక వర్గంలో గల మునగాల కొక్కిరిని బిడ్జి ని త్వరలో శాసన సభ్యురాలుతో కలసి పతిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. నియోజక వర్గాల్లో చేపట్టిన రెండు పథకాల గదుల ఇండ్ల వివరాలు అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విదంగా కోదాడ, హుజూర్ నగర్ లో వసతి గృహాలకు నిధులు మంజూరు చేయడం త్వరలో పనులు చేపట్టనున్నట్లు అలాగే సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ అందించ నున్నట్లు మంత్రి తెలిపారు.

తదుపరి రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ పనుల పురోగతిని పరిశీలన చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అలాగే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.సి రాజేశ్వర రెడ్డి, ఈ ఈ భాస్కర్ రావు, డి.ఈ రమేష్, విద్యుత్ శాఖ ఎస్.ఈ పాల్ రాజ్, డి. ఈ వెంకట కృష్ణ, పి.ఆర్. ఎస్.సి రామకృష్ణ, ఈ.ఈ వెంకటయ్య ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS