Friday, February 14, 2025
spot_img

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. 16 గ్రాముల కొకైన్ స్వాధీనం

Must Read
  • హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్
  • తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం
  • బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయం
  • పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు

అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న “డ్రగ్స్” కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో చోట డ్రగ్స్ , గంజాయి లాంటి మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయ్. యువత కూడా డ్రగ్స్ కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును చేతుల్లారా నాశనం చేసుకుంటున్నారు.డ్రగ్స్ , గంజాయి లాంటి మత్తుపదార్థాలను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ రోజు హైదరాబాద్ పోలీసులు మరో డ్రగ్స్ రాకెట్ ను గుట్టురట్టు చేశారు.డ్రగ్స్ విక్రయిస్తున్న ఒకారో కాస్మోస్ రాంసి అలియాస్ అనే నైజిరియాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ వీసా పై ఇండియా కు వచ్చి హైదరాబాద్ లో జోరుగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు.2016 , 2018 లో కూడా అనేకసార్లు డ్రగ్స్ విక్రయిస్తూ గోల్కొండ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తుంది.ఒకారో వద్ద నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

                                            

   
                                        

Latest News

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS