Thursday, July 3, 2025
spot_img

నాటుసారా తయారీ ప్రాంతాలపై ఎక్సైజ్‌ దాడులు

Must Read
  • మూడు తండాల్లో, కల్వకుర్తి పట్టణంలో దాడులు
  • 23 లీటర్ల నాటుసారా స్వాధీనం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మూడు తండాల్లో, పట్టణంలో ఎక్సైజ్‌ అధికారులు, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ అధికారులు ఒకేసారి కలిసి శనివారం తర్నికల్‌ తండా, జెపి తండా, రెడ్యాతండా, కల్వకుర్తి టౌన్‌లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 820 లీటర్ల బెల్లం పానకాన్ని నేలపాలు చేశారు. 30 కేజీల నాటుసారా తయారీకి వినియోగించే పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీ స్థావరాలపై ఒకేసారి దాడులు నిర్వహించి, నాటుసారను స్వాధీనం చేసుకోవడం పట్ల మహబూబ్‌నగర్‌ డిప్యూటి కమిషనర్‌ ఏ శ్రీనివాసరెడ్డి, ఏ విజయ భాస్కర్‌రెడ్డి, ఎస్టీఎప్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ ప్రదీప్‌రావు అభినందించారు. దాడుల అనంతరం ఐదు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS