Thursday, February 13, 2025
spot_img

21న ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్

Must Read
  • ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ
  • మెగా కప్ ను ప్రదర్శించిన నిర్వాహకులు
  • టోర్నమెంట్ డైరెక్టర్ మురళీకృష్ణం రాజు, ఆర్గనైజర్ మద్ది కన్నా గౌడ్

హైదరాబాద్ లో ఈ నెల 21న ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ నిర్వహించబోతున్నారు. దేశ, విదేశాల నుంచి ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు ఆసక్తిగల అభ్యర్థులు పాల్గొనవచ్చని టోర్నెమెంట్ డైరెక్టర్ మురళీకృష్టం రాజు, ఆర్గనైజర్ మద్ది కన్నా గౌడ్ వెల్లడించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ లో వారు ఛాంపియన్ షిప్ కు పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం టోర్నమెంట్ లో గెలిచిన వారికి అందజేసే మెగా కప్ ను ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ మర్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొదటి అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలు ఇవని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న యువత ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరో తల్వార్ సుమన్ గౌడ్, గౌరవ అతిథిగా తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS