Sunday, March 23, 2025
spot_img

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌

Must Read

శ్రీవారిని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం జీఎస్‌ఎల్వీ ఏఫ్‌-15 శాటిలైట్‌ని ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. నారాయణన్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. వెంకన్నను దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కొత్త మైలురాయిని చేరుకోబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. 1979లో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో మ్నెదటి ప్రయోగం నిర్వహించగా.. బుధవారం నిర్వహించే ప్రయోగం వందోదని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు. జీఎస్‌ఎల్వీ ఏఫ్‌-15 శాటిలైట్‌ అంతరిక్షంలోకి పంపడం ద్వారా నావిగేషన్‌ను సులభంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని నారాయణన్‌ చెప్పారు. ఇప్పటివరకూ 433 విదేశీ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రూ.4 వేల కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ఫ్యాడ్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గగన్‌యాన్‌ ప్రయోగానికి ఈ లాంచ్‌ ఫ్యాడే ఉపయోగించనున్నట్లు నారాయణన్‌ తెలిపారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS