ముకేష్ అంబానీ కి చెందిన జియో, టారిఫ్ రేట్లను భారీగా పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.తాము పెంచిన ఈ రేట్లతో అత్యధికంగా 25 శాతం వరకు రీఛార్జ్ రేట్లు పేరుగుతాయని తెలిపింది.జులై 03,2024 నుండి కొత్త రీచార్జి ప్లాన్ లు అమల్లోకి వస్తాయని స్పస్టం చేసింది.మరోవైపు 5జి ఆన్ లిమిటెడ్ ప్లాన్స్ ని కూడా పరిచయం చేసింది.జియో తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.జులై 03 లోపు రిచార్జ్ చేసుకుంటే అదనంగా అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ కూడా పొందుతారు.ప్రతిరోజు 1జీబి డేటాతో 28 రోజుల పాటు గడువు ఉన్న ప్లాన్ ప్రస్తుతం రేట్ రూ.209 ఉంది.ఇప్పుడు ఇది రూ.249కి చేరుతుంది.రూ.239 1.5 జిబి ఉన్న ప్లాన్ రూ.299కి చేరుతుంది.