Monday, August 18, 2025
spot_img

డేటా విశ్లేషణపై ఆర్టీసీ అధికారులకు అవగాహన

Must Read
  • ప్రజల అభిరుచులకు అనుగుణంగా రవాణా సేవలు
  • డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్

డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని డేటా సైన్స్,మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి తెలిపారు.ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన,నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్ బస్ భవన్ లో లీడర్ షిప్ టాక్స్ లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘ప్రజా రవాణా వ్యవస్థలో డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ వినియోగం’ అనే అంశంపై అయిన ప్రసంగించారు.ప్రతి రోజు సగటున 55 లక్షల మందిని టీజీఎస్ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చడం గొప్ప విషయమని అన్నారు.వారి ప్రయాణ డేటాకు అనుగుణంగా రియల్ టైంలో మెరుగైన రవాణా సేవలను అందించవచ్చని చెప్పారు.మెసేజ్, మెసేంజర్,మెకానిక్స్,మెషినరీ అనే 4ఎం కాన్సెప్ట్ తో సంస్థను ఉన్నతస్థాయికి ఎలా తీసుకోని వెళ్లాలో అనేదాని పై వివరణ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్నా మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు సంతృప్తికర సేవలను అందించే తీరును వివరించారు .అనంతరం ఆర్టీసీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.తెలంగాణకు చెందిన శరత్ కాటిపల్లి అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.అలాగే,ప్రముఖ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసించారు.ఆ తర్వాత మల్టీ నేషనల్ సంస్థలైన లెక్స్ మార్క్,జీఏపీ ఐఎన్సీ,ఐబీఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, హెచ్ఎస్బీసీ,అమెజాన్ లాంటి సంస్థల్లో డేటా సైంటిస్ట్ గా విధులు నిర్వహించారు.జేపీ మోర్గాన్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థకు చీఫ్ డేటా ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థ లూషియా ఏఐకి అడ్వైజర్ గా కొనసాగుతున్నారు.డేటా సైన్స్‌ ను వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు.ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలకు జీవనాడిలాగా డేటా సైన్స్ పనిచేస్తోందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన సేవలందించేందుకు డేటా విశ్లేషణను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్,జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్,కృష్ణకాంత్,ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ,సీపీఎం ఉషారాణి,సీఎంఈ వెంకన్న,వర్చ్ వల్ గా ఆర్ఎంలు,డిప్యూటీ ఆర్ఎంలు,డీఎంలు పాల్గొన్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS