Wednesday, August 20, 2025
spot_img

లచ్చిరెడ్డి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో చేరిన స్టేట్ ఎంప్లాయీస్ స్పౌజ్ ఫోరం

Must Read
  • టీజీ ఎంప్లాయీస్ జెఏసీతో జతకట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయ దంపతులు.
  • తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ఎజెండా
  • భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు

తెలంగాణ ఉద్యోగ,ఉపాధ్యాయుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ స్పౌజ్ ఫోరం చేరుతున్నట్టు ప్రకటించింది.ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ఎంప్లాయీస్ జాక్ మాత్రమే సరైన వేదిక అని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పౌజ్ ఫోరం నాయకులు తెలియజేశారు.లచ్చిరెడ్డి నాయకత్వంపై ఉన్న పూర్తి విశ్వాసం,అయిన క్రియాశీల కార్యదక్షత తెలంగాణ ఉద్యోగ వర్గానికి మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు.ఈ సంధర్బంగా స్పౌజ్ ఫోరం నాయకులు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో వేలాదిమంది దంపతులు ఉన్నారని,భర్త ఒక చోట పనిచేస్తుండగా, భార్య మరొక చోట విధుల్లో ఉన్నారని తెలిపారు.దంపతులుగా ఉన్న ఉద్యోగుల హక్కులు,వాటి పరిరక్షణ,ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లను తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డికి వివరించారని అన్నారు.అన్ని విషయాలను విన్న ఆయన సానుకూలంగా స్పందించారని,దంపతులైన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు.ఈ సందర్భంగా స్పౌజ్ ఫోరం సభ్యులు చైర్మన్ లచ్చిరెడ్డిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కె.రామకృష్ణ,చంద్రకంటి శశిధర్,తెలంగాణ స్పౌజ్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ ఎస్.వివేక్,జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ,రాష్ట్ర కోఆర్డినేటర్ సోమయ్య నరేష్,విజయలక్ష్మి,వనజ,షహనాజ్ లతో పాటు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS