Sunday, May 18, 2025
spot_img

గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్

Must Read

తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది.

ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్ 01 పరీక్షకు హాజరవుతున్నారు. గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం హైదరాబాద్ లో 08, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజ్‎గిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 01:30 తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, ప్రతి పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS