హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. 18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుండి గ*జాయి, ఈ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు.