Friday, January 24, 2025
spot_img

విద్యార్థులు అంకితభావంతో దేశానికి సేవ చేయాలి:డీజీపీ రవిగుప్తా

Must Read
  • సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ రవిగుప్తా

బౌరంపేట్ లోని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్విండ్స్ క్యాంపస్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) రవి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గురువారం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది.వేడుకల్లో భాగంగా డీజీపీ 60 అడుగుల స్తంభంపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.డీజీపీ రవి గుప్తా కి సిల్వర్ ఓక్స్ స్కూల్ ఎయిర్ ఎన్‌సిసి స్క్వాడ్రన్ ఘన స్వాగతం పలికారు.ఈ సంధర్బంగా డీజీపీ మాట్లాడుతూ సిలబస్ తో పాటు పాఠ్యేతర కార్యకలాపాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదల పెంపొందించే సంపూర్ణ విద్య అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.విద్యార్థులు పోలీస్ శాఖ మరియు ఇతర కెరీర్‌ల పట్ల ఆసక్తిని ప్రేరేపించారు.అంకితభావం మరియు సమగ్రతతో దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు ప్రోత్సహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీజీపీ రవిగుప్తాకి సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ధనుంజయ,విద్యావేత్త,రచయిత్రి, బ్లాగర్ మరియు ఫిలాంత్రోఫిస్ట్ అంజలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

ఎంపికలో అర్హులకు తావేది గ్రామ సభల్లో గందర గోళం లబ్ధిదారుల ఎంపికలో అయోమయం తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS