Tuesday, July 1, 2025
spot_img

కల్కి పై ఆసక్తికరమైన ట్వీట్ చేసిన సూపర్ స్టార్ రజనికాంత్

Must Read

యాంగ్ రెబల్ స్టార్ నటించిన ” కల్కి 2898 ఎడి ” సినిమా భారీగా కలెక్షన్ లను సొంతం చేసుకుంటూ,ముందుకెళ్తుంది.ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా విడుదలైన తొలి రోజె ప్ర‌పంచ వ్యాప్తంగా 191.5 కోట్లు క‌లెక్ట్ చేసిందని సినిమా యూనిట్ తెలిపింది.మరోవైపు కల్కి 2898 ఎడి సినిమా పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి మూవీ పై స్పందిస్తూ ట్విట్ చేశారు.కల్కి చిత్రం చూశాను..వావ్! ఇది ఒక గొప్ప సినిమా అని అన్నారు. ఇండియన్ సినిమాను నాగ్ అశ్విన్ మరోస్థాయికి తీసుకోనివెళ్లారని కొనియాడారు.ఇలాంటి సినిమాను తీసినందుకు స్నేహితుడైన అశ్వినీదత్‌కి శుభాకాంక్షలు తెలిపారు.అలానే అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపిక పదుకొణె సహా కల్కి టీమ్ మొత్తానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.గాడ్ బ్లెస్.” అంటూ రజినీకాంత్ పోస్ట్ పెట్టారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS