కేంద్రం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.ఇటీవల జరిగిన నీట్ పరీక్ష లీకైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాలని అనేక చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.అయితే పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.నీట్ రద్దు చేయాలా అనేదాని పై కేంద్రం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు వివరణ ఇవ్వాలని కోరింది.పరీక్షల్లో జరిగిన అవకతవకాల పై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని కోర్టు తెలిపింది.జస్టిస్ విక్రమ్నాథ్,ఎస్వీఎస్ భట్టీలతో కూడిన ధర్మసనం ఈ కేసును విచారించింది.వివిధ పార్టీల నుండి కోర్టు వివరణ కోరింది.తిరిగి మళ్ళీ జులై 8న ఈ కేసు పై చేస్తామని కోర్టు తెలిపింది.ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ పరీక్షను రాశారు