2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...
జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది.
ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.
జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...
తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల తెలంగాణలో చేపట్టిన రైతు రుణమాఫీ గురించి రాహుల్ గాంధీకు వివరించారు.వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానించారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ కుమార్ ఉన్నారు.
మంగళవారం నుండి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.జులై 25న సభలో భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు కేసీఆర్ అసెంబ్లీకు రానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.డిఫాల్ట్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.కవిత దాఖలు చేసిన బెయిల్ ఫిటిషన్ పై సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.60 రోజుల గడువులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ...
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.