Tuesday, November 12, 2024
spot_img

పక్షపాత ధోరణి ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోండి

Must Read
  • డీజీపీకి ఫిర్యాదు చేసిన వీ.హెచ్.పీ నాయకులు

మెదక్ పట్టణంలో పోలీసుల అలసత్వం కారణంగానే అల్లర్లు జరగాయని,బక్రీద్ పండుగ సంధర్బంగా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందజేశారు.పనిగట్టుకుని హిందువులపై కేసులు నమోదు చేశారని తెలిపారు.మెదక్ లో అల్లర్లకు కారణమైన వదిలిపెట్టి,బాధితులను రిమాండ్ కి పంపిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.మెదక్ పట్టణంలో ఆవుల తరలింపు విషయంలో స్థానిక ఇన్స్పెక్టర్ కారణంగా కత్తిపోట్లు,పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని విశ్వ హిందూ పరిషత్ నాయకులు విమర్శించారు.ఈ విషయంలో మెదక్ ఎస్పీ బాలస్వామి,ఐజి రంగనాథ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ హిందువులపైనే కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించారని ఆరోపించారు.దాడికి పాల్పడ్డ దోషులను ఉపేక్షించడం జరిగిందని,ఇది ముమ్మాటికి తగదని డీజీపీకి తెలియజేశారు.వెంటనే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.”తాను సస్పెండ్ అయిన పర్వాలేదు,వందమంది హిందూ నాయకులను జైల్లో పెడతానని మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ భయభ్రంతులకు గురిచేస్తున్నారని డీజీపీకి తెలిపారు.హైదరాబాద్ లోని మలక్ పేట నియోజకవర్గం చాధర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి పనికి వచ్చే ఎద్దులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న యువతుల విషయంలో పోలీసులు ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అక్రమంగా తరలిస్తున్న ఎద్దులను అడ్డుకున్నానందుకు యువతులను చంపేస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.అయిన ఇప్పటివరకు దోషులను పట్టుకోలేదని,వారి పై కనీసం ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు.దగ్గరుండి కొంతమంది పోలీసులు అవులను హత్య చేసేందుకు సహకరిస్తున్నారని విమర్శించారు.ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ విషయంలో దోషులను వదిలిపెట్టి బజరంగ్ దళ్,విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని,ఇలాంటి చర్యలు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయని తెలిపారు.ఖమ్మం జిల్లాలో కూడా ఆవులను మితిమీరి ఒకే వాహనంలో ఎక్కించడం వల్ల,తొక్కిసలాటకు గురై దాదాపు 12 ఆవులు చనిపోయాయని పేర్కొన్నారు.ఈ విషయం బయటకు రాకుండా తొక్కి పెడుతున్నారని తెలిపారు.వాటికి పోలీసులదే బాధ్యత అని చెప్పారు.చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన పోలీసులే,హిందూ విరోధులుగా వ్యవహరించడం ఏమాత్రం తగదని లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనల పై డీజీపీకి ఆధారాలు సమర్పించమని నాయకులు తెలిపారు.అల్లర్లకు కారణమైన దోషులను అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధపడాల్సి వస్తుందని వెల్లడించారు.డీజీపీకి కలిసిన వారిలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, విశ్వహిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ,మెదక్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్,మెదక్ విభాగ్ కార్యదర్శి మల్లేశం ఉన్నారు.

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS