Wednesday, January 8, 2025
spot_img

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

Must Read
  • ఓయూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్
  • పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు

డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు మేడ శ్రీను ఆధ్వర్యంలో డ్రగ్స్ ను రూపుమాపే ఆవశ్యకతను తెలియజేస్తూ స్థానిక ఎన్‌సిసి గేటు నుండి ఆర్ట్స్ కాలేజీ ఆవరణ వరకు 2కె రన్ నిర్వహించారు. మత్తు వదలరా మిత్రమా అనే ట్యాగ్ లైన్ తో ప్లకార్డులను చేత‌ప‌ట్టి విద్యార్థులు, యువత ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై రన్ ను ప్రారంభించగా, డీసీపీ బాలస్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. యువత విలువలతో కూడిన జీవితం అనుభవించాలన్నారు. సమాజానికి హానికరంగా మారిన డ్రగ్స్ ను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్.. ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నారన్నారు. డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్ కొండ నాగేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలారెడ్డి, అప్కార శాఖ డిఎస్పి శ్రీనివాస్, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శాంతి, నిజం కాలేజ్ ప్రొఫెసర్ జానకి రెడ్డి, కుందన్, శ్రీకర్, నర్సా గౌడ్, మణికంఠ, వినయ్, సాయి ఓంకార్ గౌడ్, వంశీ, వెంకట్, ముదిరాజ్, సురేష్, రవి, అభిలాష్, ప్రవీణ్, శంకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest News

‘సంక్రాంతికి వస్తున్నాం’

అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ &...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS