Tuesday, November 12, 2024
spot_img

తుప్రాఖుర్దు గ్రామస్థుల క‌న్నెర్ర‌

Must Read
  • వాగు క‌బ్జాపై ఆదాబ్ వరుస క‌థ‌నాలు
  • ఆదాబ్ కథనాలపై స్పందించిన కలెక్టర్
  • రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన ప్ర‌జ‌లు
  • చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులకు ఆదేశాలు
  • స‌ర్వే నెం 62/అ, 76/అ లో సుభిషి అక్ర‌మ నిర్మాణాలు
  • సుభిషి గ్రూప్‌తో మండ‌ల స‌ర్వేయ‌ర్ కుమ్మ‌క్కు
  • తూతూ మంత్రంగా స‌ర్వే.. మిగులు భూమిని మింగేసిన స‌ర్వేయ‌ర్‌

జెర్ర వాగును కాపాడండి సారూ.. అనే శీర్షికతో ఈనెల 10న ఆదాబ్ లో ప్రచురితమైన కథనంతో వాగు కబ్జాకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. వాగును రియల్ ఎస్టేట్ సంస్థ సుభిషి ఆక్రమించుకున్నట్టు, పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేసిందనీ పూర్తి వివరాలతో వార్త రాయడం జరిగింది. ఆ తర్వాతి రోజు ఈ నెల 11వ తేదీన ‘నామ్ కే వాస్త్ నోటీసులు’ అనే శీర్షికతో ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి చేతులు చాపిన ఇరిగేషన్ అధికారులు అంటూ మరో కథనాన్ని ప్రచురించింది ఆదాబ్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామ పరిసరాల్లో గ‌ల వాగు క‌బ్జాకు గురైన‌ట్లు వరుస కథనాలపై స్పందించిన ఆ గ్రామస్థులు కన్నెర్ర చేశారు. ఈ వార్తలతో కదిలిన ప్రజలు రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ శంశాక్‌ను క‌లిశారు. తమ గ్రామ పరిధిలో క‌బ్జాకు గురైన వాగును కాపాడాల‌ని, స‌ర్వే నెం 62/అ, 76/అ లో గ‌ల మిగులు భూమిని సుభిషి గ్రూప్ ఆక్ర‌మించార‌ని, అలాగే మండ‌ల స‌ర్వేయ‌ర్ ఆ సంస్థ‌తో లోపాయ‌కారి ఒప్పాందాలు కుదుర్చుకున్న‌ట్లు తుప్రాఖుర్దు గ్రామ‌స్థులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కబ్జాకు గురైన వాగు రక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం మండ‌లం తుప్రాఖుర్దు గ్రామ ప్ర‌జ‌లు గ్రామ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 62/అ, 76/అ లో గ‌ల భూమితో పాటు వీటి ప‌క్క‌న గ‌ల భూముల‌ను సుభిషి సంస్థ వారు కొనుగోలు చేసి వెంచ‌ర్ ఏర్పాటు చేశారు. దీనికి గాను వీరు ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్ ద్వారా స‌ర్వే చేయించడం జరిగింది. కానీ, ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్ సుభిషి సంస్థ‌తో కుమ్మ‌కై కొంద‌రికే పై స‌ర్వే నెంబ‌ర్‌లో నోటీసులు పంపించాడని తెలుస్తోంది. కాగా వారికి వారే స‌ర్వే చేయించుకున్నారు. పై స‌ర్వే నెంబ‌ర్‌ల‌లో మిగులు భూమి ఉన్న‌ది. ఈ విష‌యం అంద‌రికి నోటీసులు ఇవ్వ‌డంతో బ‌ట్టబ‌య‌లు అవుతుంద‌ని ఉద్దేశ‌పూర్వ‌కంగా తూతూ మంత్రంగా స‌ర్వే ముగించినట్టు సమాచారం. కావున ఏడీ స‌ర్వే చేయించ‌గ‌ల‌ర‌ని, అదే విధంగా ఈ స‌ర్వే నెంబ‌ర్‌ల‌లో ఎలాంటి ఇరిగేష‌న్ అనుమ‌తులు లేకుండా వాగును ఆక్ర‌మించి, కాలువ‌ను కొంత భాగం మూసివేయ‌డం జ‌రిగింది. ఈ విష‌యంపై గ్రామ‌స్తులు ప్ర‌శ్నించ‌గా సుభిషి సంస్థ యాజ‌మాన్యం దౌర్జ‌న్యం చేస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విష‌యమై జూన్ నెల‌లో ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికైనా ఈ విష‌యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామస్థులు రంగారెడ్డి క‌లెక్ట‌ర్ శంశాక్‌కు విజ్ఞప్తి చేశారు.

అయితే గ్రామస్థుల కంప్లైంట్, ఆదాబ్ లో వచ్చిన వరుస కథనాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శంశాక్ స్పందించారు. స‌ర్వే నెంబ‌ర్ 62/అ, 76/అ లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై అధికారులను వివరణ కోరారు. కబ్జాకు గురైన వాగు, మిగులు భూమిపై పూర్తిగా విచారణ జరిపి రియల్ ఎస్టేట్ సంస్థ సుభిషిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఆదాబ్ వరుస కథనాలతో తమ గ్రామస్థులకు న్యాయం జరుగుతుందనీ, ఇందుకు కారకులైన ఆదాబ్ పత్రిక యాజమాన్యానికి తుప్రాఖుర్దు గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలియజేశారు.

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS