Monday, November 4, 2024
spot_img

అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్ దే

Must Read

( ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగబాట్ల పవన్ కుమార్ భవిష్యవాణి )

ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి తన ఉపాసనా శక్తీ ని ఉపయోగించి 100 % ఖశ్చితమై ఫలితాలను ముందే చెప్పి అందరిని ఆశ్చర్య పరచిన ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ ఈ సారి మరో సంచనాలకు నాంది పలుకుతూ పలు అంశాలపై తన ఉపాసనా శక్తి ద్వారా భవిష్యవాణి చెప్పారు.ఎంతో ప్రతిష్టాత్మకం గా పలువురు భారీ తారాగణం తో నిర్మించబడి విడుదల కాబోతున్న ప్రభాస్ యొక్క కల్కి సినిమా అత్యంత అద్భుతమైన రీతిలో సినిమా ప్రియుల అభిమానాన్ని సొంతం చేసుకొని విజయాన్ని సాధించబోతుందని తెలిపారు.ఈ సినిమాకు మాత్రమే కాకుండా ఇందులో పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు,గుర్తింపు రానున్నాయని ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ తన భవిష్యవాణి ద్వారా చెప్పారు.అయితే కల్కి సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించినా ఆర్ధికంగా మాత్రం నిర్మాతలకు అంతంత లాభాలు మాత్రమే వస్తాయని వారు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేక పోవచ్చని చెప్పారు. ప్రస్తుతం అమెరికా లో ఎంతో ప్రతిష్ఠాత్మకం గా సాగుతున్న అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.అమెరికా లో నివసించే వారు మరియు అక్కడ ఉన్నత చదువు నిమ్మిత్తం వెళ్లాలనుకునే భారతీయులకి అనుకూలమైన అనేక విధానపరమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారని తెలిపారు.రానున్న రోజుల్లో భారతీయుల అమెరికా కలలు సఫలం కానున్నాయని పవన్ కుమార్ శర్మ ఈ సందర్భం చెప్పారు.అంతే కాకుండా గత 9 నెలలు గా దిన దిన పరమార్ధం గా పెరుగుతున్న బంగారం ధరలు కూడా ఒక్కసారిగా 27 జూన్ 2024 నుండి అమాంతం తగ్గి పోతాయని,ఈ విధంగా రేట్లు తగ్గిపోవడమనేది దాదాపు 10 % లేదా అంతకి మించి ఉండే అవకాశం ఉందని ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ గారు తన ఉపాసనా శక్తిద్వారా భవిష్య వాని చెప్పారు.గతం లో ఎన్నికల ఫలితాల గురించి వీరు చెప్పిన తన భవిష్యవాణి నిజమైన తరుణంలో ఈ సారి ఏంజరుగుతుందా అని పలువురు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS