Wednesday, October 15, 2025
spot_img

క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

క్రీడల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులను,స్పాన్సర్లను ఈ సందర్బంగా సీఎం అభినందించారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2036 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశం ఇండియాకు దక్కితే హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని,ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీను కూడా అభ్యర్థించినట్లు వెల్లడించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.రాబోయే ఖేలో ఇండియా యువ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రిను కలిసి కోరిన విషయాన్ని వివరించారు.దేశంలో ఏ క్రీడలు జరిగినా తెలంగాణలో హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంతర్జాతీయ ఖ్యాతి గడించాల్సిన సందర్భాల్లో గత ప్రభుత్వాల ఫోకస్‌ నిర్లక్ష్యం వల్ల ఈ దేశానికే క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్‌ నగరం ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

2028 ఒలంపిక్స్‌లో తెలంగాణ నుంచి అత్యధిక మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు.తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This