- కోట్లాది రూపాయల ఆలయ భూములు హాంఫట్
- వెలుగులోకి తెచ్చిన ఆదాబ్ హైదరాబాద్
- ‘దేవుడి భూమి రాక్షసుడి పాలు’ అనే శీర్షికతో కథనం
- స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు
- సుమారు 4.22ఎకరాలలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు
- అక్రమార్కులపై కొరడా ఝులిపించిన అధికార యంత్రాంగం
- అత్తాపూర్, రాజేంద్రనగర్ లో కూల్చివేతలు, భూమి స్వాధీనం
- లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి
- కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్ లోని అత్తాపూర్, రాజేంద్రనగర్ లో కబ్జాకోరుల కండ్లలో పడి ఆలయ భూములు మాయమయ్యాయి. అనంత పద్మనాభ స్వామికి చెందిన సుమారు 4.22 ఎకరాల దేవుడి భూమిని కొట్టేశారు. దేవాలయ భూములను అక్రమార్కులు కొల్లగొట్టి షెడ్లు, అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ‘దేవుడి భూమి రాక్షసుడి పాలు’ అనే శీర్షికతో కథనాన్ని గత నెల డిసెంబర్ 31న ప్రచురించడం జరిగింది. వార్త పూర్వపరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, అత్తాపూర్ గ్రామంలో విలువైన దేవాలయ భూమి కబ్జాకు గురైంది. అత్తాపూర్ లోని సర్వే నెం. 435 మరియు 446లోని భూమిని అక్రమార్కులు కొట్టేశారు. సర్వే నెం. 435లో 1 ఎకరం 34గుంటలు అలాగే సర్వే నెం. 446లో 2 ఎకరాల 28గుంటల భూమి ఆక్రమణకు గురైంది. అత్తాపూర్ లోని మొత్తం 4. 22 ఎకరాల భూమి సుమారు రూ.400 కోట్ల విలువ ఉంటుంది గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయ భూమి. సదరు భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడు. అయితే మరొక వ్యక్తి అయిన శ్రీపాల్ రెడ్డికి ఇట్టి భూమి మొత్తాన్ని లీజ్ కు ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఎండోమెంట్ శాఖ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దేవాలయ భూమిని ఇంత ఈజీగా ఎలా కబ్జాకు గురైందని స్థానికులు సందేహం వ్యక్తం అయింది.
కాగా, ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూమిని ఆక్యూఫై చేసిన.. శ్రీపాల్ రెడ్డి దాని పేరున కోట్లాది రూపాయలు లబ్దిపొందుతున్నాడు. ఎండోమెంట్ భూమిని కబ్జా చేసి.. దానిలో క్రికెట్ కోర్టు, టెన్నీస్ కోర్టు, ఫుట్ బాల్ కోర్టుల కోసం కిరాయికి ఇచ్చి లక్షల్లో డబ్బులు రాబడుతున్నాడు. అదే విధంగా కారు రిపేరింగ్ షెడ్ లకు భూమిని లీజ్ ఇచ్చుకొని లక్షల్లో లబ్ధి పొందుతుండడం గమనార్హం. ఈ విషయం ఆదాబ్ దృష్టికి రావడంతో దేవుడి భూములను కాపాడే యత్నం చేసింది. కాగా, ‘దేవుడి భూమి.. రాక్షసుడి పాలు..‘ అన్న వార్తకు ఎండోమెంట్ శాఖ కదిలింది. వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి, దేవుడి స్థలాన్ని కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా, అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూమిగా గుర్తించారు. కోట్లాది రూపాయల విలువ చేసే దేవుని భూములను కాపాడారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. 4 ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాలన్నింటిని అధికారులు నేలమట్టం చేశారు. జేసీబీలతో అక్రమంగా వెలసిన షెడ్డులను తొలగిస్తున్న క్రమంలో స్థానికులకు, అధికారులకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా వెనక్కి తగ్గని అధికారుల బృందం చివరకు అక్రమ నిర్మాణాలన్ని కూల్చివేశారు. ఎండోమెంట్ అధికారులు ఎంతో శ్రమించి దేవుడి భూమిని కాపాడారు.
కానీ, అక్రమార్కుడు ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టి ఇన్నాళ్లపాటు లీజుకు ఇచ్చి లక్షల్లో డబ్బు సంపాదించాడు. దేవుడి భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం తిరిగి వసూల్ చేసి, కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.