- ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ
- రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలో
రూ.7 వేల జమ - కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే
- ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్ని ఇబ్బందులు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.గురువారం సచివాలయంలో తెలంగాణలోని రైతులకు రూ.లక్ష రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.తొలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7 వేల నిధులను జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ సంధర్బంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు.అనంతరం రైతు రుణమాఫీ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలశాసనమని అన్నారు.జులై 20 న ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీను కలుస్తామని తెలిపారు.వరంగల్ లో ఈ నెలాఖరులోగా కృతజ్ఞత సభ నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీకి నష్టం వస్తుందని తెలిసిన ఆ నాడు సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చి,4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చరాని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలశాసనమని మరోసారి నిరూపించిందని వెల్లడించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని,రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.ఎన్ని సమస్యలు,సవాళ్ళు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నామని,కొంతమంది రైతు రుణమాఫీ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని ఎవరు నమ్మొద్దు అని కోరారు.ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు.