Saturday, December 28, 2024
spot_img

అల్లు అర్జున్‌పై బచ్చన్‌ ప్రశంసలు

Must Read
  • ఆయనతో నన్ను పోల్చకండి.. కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్‌ వ్యాఖ్యలు

’పుష్ప2’తో టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరోపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ’కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్‌ గురించి బిగ్‌ బీ మాట్లాడారు. అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ’కౌన్‌ బనేగా కరోడ్‌పతి’. ప్రస్తుతం దీని 16వ సీజన్‌ ప్రసారమవుతోంది. దీని తాజా ఎపిసోడ్‌కు కోల్‌కతాకు చెందిన ఓ గృహణి కంటెస్టెంట్‌గా వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్‌, అమితాబ్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దీనిపై అమితాబ్‌ స్పందిస్తూ.. ’అల్లు అర్జున్‌ తనకు వచ్చిన గుర్తింపులన్నిటికీ పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల బన్నీ నటించిన ’పుష్ప: ది రూల్‌’ విడుదలై మంచి విజయం సాధించింది. విూరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడండి. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అతడితో నన్ను పోల్చొద్దు’ అంటూ సరదాగా చెప్పారు. దీనికి ఆ కంటెస్టెంట్‌ స్పందిస్తూ.. ’కొన్ని సన్నివేశాల్లో విూ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదోఒకరోజు అల్లు అర్జున్‌ను చూస్తే నా కల నెరవేరుతుంది’ అని చెప్పారు. ఇక ’పుష్ప 2’ ప్రచారంలో భాగంగా ముంబయిలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ.. అమితాబ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్టీల్రో స్టార్‌గా ఉన్నారని.. ఎంతోమంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. అమితాబ్‌ సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకువెళ్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో షేర్‌ చేసిన అమితాబ్‌.. అల్లు అర్జున్‌ పనితీరుకు తాను అభిమానినని పోస్ట్‌ పెట్టారు. ఎన్నో మంచి విజయాలు అందుకోవాలని కోరారు. దీనికి బన్నీ రిప్లై పెడుతూ.. ’విూరు మా సూపర్‌ హీరో. విూనుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా. నాపై విూకున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Latest News

మన్మోహన్ కేబినేట్‌లో పనిచేయడం అదృష్టం

తెలంగాణతో ఆయనది ప్రత్యేక అనుబంధం రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కెసిఆర్‌ ప్రకటన మన్మోహన్‌ అంత్యక్రియల్లో బిఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా నివాళి అర్పించనున్న కెటిఆర్‌ బృందం కెసిఆర్‌ ఆదేశాలతో హస్తినకు పయనం మాజీ ప్రధానమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS