సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగ సభలో అయిన పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. “ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు..పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై.. రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ..రూ.7,625 కోట్ల రైతు భరోసా..ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్.. రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్..రూ.1433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు.. ఒక్క ఏడాదిలో.. 54 వేల కోట్ల రూపాయలతో..రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు..రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో..అన్నదాతలతో కలిసి..రైతు పండుగలో పాలు పంచుకోవడానికి..ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా.” అని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.