- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 06 హామీలను మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను చేర్చుకుంది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీలనే మర్చిపోయిందని మండిపడ్డారు.ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీను కూడా నెరవేర్చలేదని అన్నారు.బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని తెలిపిన రాహుల్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందని వీటి పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.