మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.