Tuesday, November 26, 2024
spot_img

రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత నిజమేనా..? పార్ట్- 02

Must Read
  • బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
  • అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..?
  • ఏడాదికే బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది..?
  • బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..?
  • తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..?
  • అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా..?
  • తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం..
    -పొలిటికల్ కరెస్పాండెంట్ కే వాసు కుమార్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి తెలంగాణకు చెందిన ఓ కలెక్టరును ప్రశ్నించడమే తప్పు..కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టరుపై చేయి కూడా చేసుకోవచ్చా..ఇదెక్కడి న్యాయం. కలెక్టరు ఘటనపై గులాబీ నేతలు ఖండించక పోగా, కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం నిజంగా దురదృష్టకరం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మన్ననలు పొందిన నాయకులు మాత్రమే అధికారం చేపడుతారు. గుట్కా బ్యాచ్ ,గుండాలతో అదిరించి బెదిరించి గద్ద నెక్కాలని చూస్తున్న నాయకులకు ఎక్కువకాలం రాజకీయంగా మనుగడ ఉండదని ఇకనైనా ఖద్దరు బట్టలు వేసుకుని తిరిగే నాయకులు గుర్తిస్తే మంచిది. లీడర్లు అంటే సోకులబట్టలు వేసుకుని ఆటోలో ప్రయాణించడము కాదు. నలుగురు గుంపును వేసుకుని ఢిల్లీని చుట్టేయడము కాదు ..బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సహాయం కోసం ఆ పార్టీ పెద్దల ఇంటి గుమ్మం ముందు నిలబడ్డ ఎంత మంది గోడు ఆ పెద్దలు విన్నారో ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది. మీ వెనుకాల మీ నాయకులు మిమ్మల్ని ఎన్నిసార్లు అనరాని మాటలు అన్నారో మీకు తెలియదా. మీ నాయకులకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక, సరైన సమయంలో మీరు ముఖం చాటేసిన సందర్భాలు కోకొల్లలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో వాలాలు పలుసార్లు ఆందోళన చేపట్టారు. మరి అప్పుడు వారిని మీరు పట్టించుకోలేదే. ఇప్పుడు ఎందుకు కపట ప్రేమని, మొసలి కన్నీరును కారుస్తున్నారు. అధికారం ఉంటె ఓ లెక్క…అధికారం లేకపోతె మరో లెక్కనా..ఇదెక్కడి న్యాయం.

ఏడాదికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది ..?

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడనికి, తమ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారం చేపట్టకముందు ఇచ్చిన హామీలెన్ని. అధికారం చేపట్టాక నిలబెట్టుకున్నవెన్ని. అప్పుడైతే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సమయం. పరిస్థితులు, మంచి రోజులు రావాలి అని సర్ది చెప్పారు. కానీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మాత్రం ఏడాదిలోపే ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టి చూపించాలా. ఇదెక్కడి ధర్మం .అధికారంలో ఉన్నపుడు అభివృద్ధి పేరుతొ మీరు చేసిన అప్పులు వాటి తాలూకు వడ్డీలు ఎవరు చెలించాలి..? మీకు అధికారం పోగానే కుర్రో మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారే. అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులను ,మీ పార్టీ కార్యకర్తలనైనా పట్టించుకున్నారా..? కనీసం వాళ్ళ ముఖాలైన చూశారా..? ఆ మూల్యమే నేడు ఎన్నికల్లో మీరు చవిచూశారు. ఇప్పటికి మీ ఆలోచనలో మార్పు రాకపోతే ఎవ్వరు ఏమి చేయలేరు. కేవలం మీ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అధికార పార్టీ ఫై చిందులు వేస్తున్న మీ వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు.

బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..?
నగరానికి కూత వేటు దూరంలోని చౌటుప్పల్ ప్రాంతం, దివీస్ లాంటి సంస్థ చేతిలో పడి కొన్నెండ్లుగా గిలగిలా కొట్టుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు. దివీస్ కారణంగా చౌటుప్పల్ ప్రాంతంతో పాటు, సమీప గ్రామంలోని మనుషులు, మూగ జీవాలు..జీవచ్ఛవాలుగా మారి చెప్పుకోలేని..వింత వ్యాధుల భారిన పడినప్పుడు మీరు ఎందుకు వారిపై మీ కరుణ పాటవాలు చూపలేదు. మీ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని బై ఎలక్షన్ సమయంలో దత్తత తీసుకున్నారు. ఎన్నికల్లో మీరు అనుకున్న పని అయిపోయాక మునుగోడు సీటును మీరు గెలుచుకున్నాక ఆ గ్రామాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు కదా. కనీసం ఆ ప్రాంతాలకు రోడ్లైనా వేశారా ..ఇప్పుడెందుకు ఇంతలా రంకెలు వేస్తున్నారు. నగరంలో పోల్యూషన్ క్యాటగిరిలో రెడ్ స్థానంలో ఉన్న కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. అవి నగర పౌరులతో సహజీవనం చేస్తూ వారి ఆరోగ్యాలను హరిస్తున్నాయి. వాటి దుష్పలితాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో నగరం నుంచి వాటిని తరిమికొట్టలేదు. నాడు మీరు చేసిన పాపం వెయ్యింతలై నేడు నగర పౌరుల పాలిట శాపంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎందరికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..?
ఉద్యమం అంటూ యువకులను రెచ్చగొట్టి స్వరాష్ట్రం కోసం ఉసిగొల్పినప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు. తెలంగాణ కల సాకారం తరువాత తూచ్ అన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు..మీరు అధికారం చేపట్టాక ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టారు ..కార్పొరేట్ వ్యవస్థలను రూపుమాపుతా అన్నారు అధికారంలోకి రాగానే అనీ మరిచిపోయారు. పేదోళ్లకు డబుల్ ఇండ్లు ఇస్తామని అన్నారు ఎందుకు ఇవ్వలేదు. ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఆర్టీసీని ఎందుకు నిర్వీర్యం చేశారు. మీ పదేండ్ల కాలంలో ఒక్కరి కైనా పర్మినెంట్ ఆర్టీసీ ఉద్యోగ అవకాశం కల్పించారా.? ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడెందుకు నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. గాలిలో అబద్దాల మెడలు కట్టడం మీతో అయినంతగా ఎవరితో కాకపోవచ్చు అనే సామెత తెలంగాణలో ఇంకా వాడుకలోనే ఉంది.

అమర వీరుల కుటుంబాలకు రేషన్ కార్డునైనా ఇచ్చారా.. ?

అమర వీరుల కుటుంబాలకు కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనైన ఇచ్చారా. రేషన్ కార్డునైనా ఇచ్చారా, పెన్షన్లను అయినా ఇచ్చారా. ఎందుకు ఈ సుద్ద పూస నీతులు చెబుతూ ప్రజలను ఇంకా ఇంకా మోసం చేయాలనీ చూస్తున్నారు. ఇండ్లు కట్టినమని గొప్పలు చెప్పుకుంటున్న మీరు. కట్టిన ఇండ్లు అర్హులైన పేదలకు ఎందుకు ఇవ్వలేదు. చెరువులను,కుంటలను రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని ఆక్రమించుకుని. మీ నేతలు చేసిన దురాగతాలను ఎందుకు అడ్డుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉన్న చెరువులెన్ని, మీ పాలన తరువాత మిగిలిన చెరువులెన్ని చర్చపెడితే మాట్లాడటానికి ముందుకు వస్తారా.? ఈ ప్రపంచంలో డబ్బు,అధికారం, హోదా అనేవి ఏవి శాశ్వతం కాదు. నేడు విగ్రహాలు పెట్టి పూజలు అందుకుంటున్న మహా నేతలంతా కొద్దో గొప్పో ప్రజలకు మంచి చేసినవాళ్ళే. అదే మంచి మీరు చేస్తే దేవుళ్లు అవుతారు చేయకపోతే గతాలుగా మిగిలిపోతారు.

Latest News

గ్యారంటీ ఇవ్వగలను..ప్రధాని మోడీ రాజ్యంగం చదవలేదు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‎సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS