కువైట్ అగ్నిప్రమాదం ఘటనలో మరణించిన భారతీయ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం రూ.2లక్షల సాయం ప్రకటించింది.ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.గాయపడిన వారు త్వరగా కొలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.అనంతరం తన అధికార నివాసంలో అగ్నిప్రమాదం ఘటన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.కువైట్ లో ఉన్న భారతీయులకు అన్నీ విధాలా సహాయం అందించాలని,అగ్నిప్రమాదంలో మరణించినా వారి మృతదేహాలను త్వరగా భారత్ కు తీసుకొని వచ్చే విధంగా చూడాలని విదేశాంగశాఖ సహాయ మంత్రిని కోరారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 49కి చెరినట్టుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు.మరణించిన వారిలో 42మంది భారతీయులే ఉన్నారని తెలిపారు.మృతుల్లో కేరళ,తమిళనాడు,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తుంది.