Friday, July 4, 2025
spot_img

రైతు రుణమాఫి నిర్ణయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Must Read
  • టీపీసీసీ నాయకులు బట్టు జగన్

వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్బంగా టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ మట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకి ఇచ్చినా మాట ప్రకారం 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రుణాలను రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ రుణమాపి డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న రుణాలకు వర్తింపు ఉంటుందని తెలిపారు.రుణమాఫీ ద్వార 48 లక్షల మంది రైతులకు ఉపయోగపడుతుందని అన్నారు.దాదాపు 31 వేల కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆగస్టు 15, 2024లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.సర్కారు రుణమాఫి నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల హర్షాతిరేకాలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం పక్షాన రాష్ట్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాంపల్లి ఓబీసీ అధ్యక్షుడు బట్టు శ్రీను యాదవ్ మాజీ సర్పంచ్ కోన్రెడ్డి వెంకటయ్య గ్రామ శాఖా అధ్యక్షుడు బట్టు శ్రీశైలం యాదవ్ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి చంద్ర రెడ్డి, లింగా రెడ్డి మేకల రాములు , కొండల్ ,వంగూరి చంద్రయ గొసుల శ్రీను, సాయిలు రైతులు రాములు, ఇద్దయ్య్య మద్ది రమేష్ మరియు బట్టు గిరీ తదితరులు పాల్గోన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS