Sunday, August 17, 2025
spot_img

జంట మున్సిపాల్టీలకు కొత్త మేయర్లు

Must Read
  • బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లలో యధేచ్చగా అవినీతి
  • నాలుగున్నరేళ్లుగా అక్రమాలతో పయనించిన కార్పొరేటర్లు మారేనా.?
  • పెండింగ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
  • ఖాళీ ఖజానాతో ముందుకు సాగేనా
  • అభివృద్ధి పనులతో మన్ననలు పొందుతారా
  • అవినీతికి పాల్పడి ప్రజలతో ఛీకొట్టించుకుంటారా.!

గత ఎనిమిది నెలలుగా పీర్జాదిగూడ మేయర్ పీఠం ఎట్టకేలకు శుక్రవారం రోజున తెరపడింది. మేయర్ జక్కా వెంకట్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఈ మేయర్ స్థానం కూడా హస్తగతమైంది. తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పంతంతో జవహర్ నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ మేయర్ పీఠాలు మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం కలిగించాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా… కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ పీర్జాదిగూడలో చీకటి పాలనకు అంతం పలికి వెలుగులు నింపే రోజులు వచ్చాయని నియంతృత్వ, ఏకపక్ష పాలన నుండి పీర్జాదిగూడ విముక్తి అయ్యిందని అన్నారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మేయర్లతో నాలుగున్నర సంవత్సరాల నుండి అవినీతి, అక్రమాలకు పాల్పడిన చాలా మంది కార్పొరేటర్లే కాంగ్రెస్ లో ఉండటం గమనించదగ్గ విషయం. వచ్చే వారం మేయర్ గా అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నూతన మేయర్ల ముందు పెను సవాళ్లు :

బోడుప్పల్, పీర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్ఆర్.డిపి స్ట్రామ్ వాటర్ పనులు, పీర్జాదిగూడ కమాన్ నుండి రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో పనిచేసిన వాటికీ బిల్లులు చెల్లించనందున కాంట్రాక్టర్లు కాళ్ళరిగేలా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మినీ స్టేడియం, మోడల్ లైబ్రరీలు, ముఖ్యంగా యాభై పడకల ఆసుపత్రి ఊసే లేదు. ఇలా జంట మున్సిపల్ లో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఖజానా ఖాళీగా ఉన్న కొద్దికాలంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు జరగాలంటే, మేయర్లను మార్చిన పెద్దలే అధిష్టానంతో పోరాడైనా నిధులు తెస్తేనే అభివృద్ధి జరగవచ్చునేమో.

అవినీతి, అక్రమాలను ఆపి ప్రభుత్వ ఆదాయంను కాపాడగలరా.!

జంట మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే పలుచోట్ల పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇక అక్రమ నిర్మాణాలు చెప్పనవసరం లేదు. ఎక్కడ అక్రమ నిర్మాణం జరిగినా అక్కడ కార్పొరేటర్ల హస్తముంటుంది. ప్రభుత్వ భూముల్లో కూడా కొంతమంది కార్పొరేటర్లు ఎలాంటి అనుమతుల్లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తూ మున్సిపల్ ఆదాయానికి భారీగా గంఢీ కొడుతున్నారు. ఇకనైనా కొత్త మేయర్ల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేసి ప్రజల అభిమానం చూరగొంటారో లేక పాత పద్దతిన అవినీతి అక్రమాలకు పాటు పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారోనని మున్సిపల్ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS