Friday, July 4, 2025
spot_img

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది

Must Read
  • కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
  • ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తాం
  • మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి
  • సీఎం రేవంత్ రెడ్డి

కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జీ.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నయం చూపిస్తామని, ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. పేదలకు నష్టం చేకూర్చే విధంగా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మూసీని ప్రక్షాళన చేయకుండా అలాగే వదిలేస్తే , భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, వారిని ప్రభుత్వం అన్నీ రకాలుగా అదుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Latest News

ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డియోగో జోటా మృతి

స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డియోగో జోటా గురువారం మృతి చెందాడు. మార్కా నివేదిక ప్రకారం సనాబ్రియాలోని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS