Thursday, July 3, 2025
spot_img

ఆకట్టుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’ మూవీ ట్రైలర్

Must Read

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది.

ట్రైలర్ ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. నిజ జీవిత ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని సన్నివేశాలను చక్కగా చిత్రీకరించారు. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ దేశం కోసం, ధర్మం కోసం నక్సలైట్లతో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ తో మాట్లాడటం ట్రైలర్‎లో చూపించారు.

యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. చక్కని కెమరా వర్క్ కి నేపథ్య సంగీతం కూడా తోడవడం కలిసొచ్చే అంశం. టెక్నికల్‎గా ఈ సినిమా అన్ని విభాగాల్లో హైలైట్‎గా నిలిచింది. రాకేష్ ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రల్లోకి ఇది చాలా డిఫరెంట్ అని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం తన ఫిజికల్ ట్రాన్సఫరమేషన్ కూడా మెచ్చుకొనే విధంగా ఉంది.

1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటికే విడుదలైన సినిమా టీజర్, గ్లిమ్ప్స్, మూడు పాటలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS