- ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్న జిల్లెడు చౌదరిగూడ మండల ప్రజలు
- ప్రభుత్వ భూములను కాపాడలేకపోతున్న తాహశీల్దార్ జగదీశ్వర్
- కాసులు ఇస్తే ఆగ మేఘాల మీద పనులు పూర్తి
- ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు
- అయినా పట్టించుకోని అధికారులు
- చెరువు శిఖం భూముల కు నాలా కన్వర్షన్
- స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పనిచేస్తున్నానని చెప్పుకోవడం కొసమెరుపు
- మండలంలో నియంతగా వ్యవహరిస్తున్న తాహశీల్దార్
తాను నియంతల వ్యవహరిస్తూ నిరుపేద రైతులను ప్రజలను ముప్పు తిప్పలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ మండల తహసీల్దార్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లెడు చౌదరి గూడెం మండల తాసిల్దార్ గా పనిచేస్తున్న జగదీశ్వర్ ఆగడాలు అన్ని ఇన్ని కావని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఆగ మేఘాల మీద కార్యాలయంలో పనులు జరుగుతాయని డబ్బులు లేని వాళ్ళు వస్తే నెలలు సంవత్సరాలు గడిచిన ఏడ వేసిన గొంగళి ఆడనే అన్నతీరుగా మండల కార్యాలయంలో జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మండల కేంద్రానికి కూతబెట్టి దూరంలో తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ఎర్రం చెరువు కబ్జాకు గురవుతున్న పట్టించుకున్న పాపాన పోలే ప్రభుత్వ శిఖం భూమి అని రెవెన్యూ అధికారులు ఓవైపు చెప్పుతూనే మరోవైపు సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఎర్రం చెరువును కొందరు వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ చేసిన విషయం రికార్డుతో సహా వెలుగులోకి వచ్చింది ఈ విషయంపై మండల తాహాశిల్దారు ను వివరణ కోరగా పొరపాటున జరిగి ఉండొచ్చని నిర్లక్ష్యంగా చెప్పడం కోసం మెరుపు…..

అధికారుల పుణ్యమా అని ఆ మండలంలో చెరువుకు సంబంధించిన శిఖం భూములను కొందరు అక్రమార్కులు అప్పనంగా కొట్టేస్తున్నారు.శిఖం భూములను రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఏకంగా నాలా కన్వర్షన్ లు చేయడం ఆసక్తికర విషయం ఓ వైపు ఇరిగేషన్ అధికారులు ఇది ముమ్మాటికి శిఖం భూమి అని తేల్చి చెపుతూ రికార్డు లో నమోదు చేసినా తమకేమి పట్టనట్లు రెవెన్యూ యంత్రాంగం తాపీగా నాన్ అగ్రికల్చర్ గా ఆ శిఖం భూమిని మార్చేసింది. ఈ భూములకు సంబందించి పాత రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ శిఖం అని చూపుతున్న కొందరు వ్యక్తులు ఇది తమకు చెందిన భూములని కోర్టుకెక్కారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ శిఖం అని చెపుతున్న రెవెన్యూ అధికారులు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్షన్ ఎలా చేశారో తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే ప్రభుత్వ శిఖమైనా పట్టాదారునికి చెందిన శిఖం భూమి ఐన భూమి స్వభావంలో మార్పు (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) గా మార్చే నిబంధన రెవెన్యూలో లేదు. తహసీల్దార్గా అతనికి నాలా కన్వర్షన్ చేసే అధికారం లేదు దీనిని రెవెన్యూ డివిజన్ అధికారులు (ఆర్డిఓ) చేయాలి మరి ఇక్కడ మాత్రం జరిగిన తతంగం వెనుక కథ ఏముందో… ఇది రంగారెడ్డి జిల్లా జిల్లేఢ్ చౌదర్ గూడ మండల తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఎర్రంచెరువు శిఖం భూమి అంటూ రెవెన్యూ అధికారి సర్వే నెంబర్ 145లో 10 ఎకరాల 30 గుంటల భూమి ఇది పక్కా ప్రభుత్వ భూమి అని చెబుతున్నారు కానీ ఇదే భూమిలో 4గుంటల భూమిని మరో వ్యక్తి కి నాలా కన్వర్షన్ చేశారు అవును అది పొరపాటున జరిగి ఉండవోచ్చు అంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు అధికారులు. నాలా కన్వర్షన్ చేసుకున్న వ్యక్తి 15/2/2024 నాడు అప్లై చేసుకుంటే 17/ 2/2024 నాడు నాలా కన్వర్షన్ జరిగింది. రెండు రోజుల వ్యవధిలో ఈ తతంగాన్ని ముగించి వేశారు దీనిపై ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారిని ఎవరైనా ఇలా ఎలా జరిగింది అని అడిగితే అతను నియంతలా ఫోజులు కొడుతూ ఇదంతా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకే చేశామని తప్పించుకుంటాడు. మరి ఇలాంటి అధికారిపై ఎమ్మెల్యే ఏలా స్పందిస్తారో చూడాలి.