Friday, July 4, 2025
spot_img

కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి – హరీష్ రావు

Must Read
  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల పై పోలీసుల లాఠీఛార్జ్
  • పోలీసుల లాఠీఛార్జ్ పై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు
  • కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.?
  • విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది.
  • కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి
  • ఐదు నెలల్లోనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
  • వెంటనే రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

సాగునీరు , కరెంటు ఎ కాకుండా విత్తనాలు కూడా అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నది అని ఆరోపించారు మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మంగళరవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతుల పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.ఈ ఘటన పై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కోసం విత్తనలు అందుబాటులో లేవని విత్తనాల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఐదు నెలల్లోనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని , రైతుల పై లాఠీ ఛార్జ్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఇందుకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS