Friday, January 24, 2025
spot_img

వయనాడ్ నుండి తప్పుకున్న రాహుల్

Must Read
  • కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ కీలక నిర్ణయం
  • వయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్
  • ఖర్గే నివాసంలో కీలక సమావేశం
  • వయనాడ్ నుంచి రాహుల్ ను తప్పించి,పోటీలో ప్రియాంక గాంధీను
    దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ అగ్రనేతలు..
  • కాంగ్రెస్ అగ్రనాయకుల నిర్ణయంతో వయనాడ్ కి గుడ్ బై చెప్పిన రాహుల్
  • తొలిసారిగా ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
  • ప్రియాంక భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం:కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.వయనాడ్,రాయబరేలి నుండి లోక్ సభ స్థానాల్లో గెలిచిన రాహుల్ వయనాడ్ సీటును వదులుకున్నారు.సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం నుండి తప్పుకోవాలని,ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీను పోటీలోకి దింపాలని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.2024 లోక్ సభ ఎన్నికల్లో రాయబరేలి నుండి సోనియాగాంధీ ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నట్టు ప్రకటించారు.ఆ తర్వాత సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు.దీంతో వయనాడ్‌తో పాటు రాయబరేలి నుంచి కాంగ్రెస్ పార్టీ రాహుల్‌ను బరిలోకి దింపింది.పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ రాహుల్ భారీ మెజారిటీతో గెలుపొందారు.ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.

వయనాడ్‌తో రాహుల్ అనుబంధం :

రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా, అమేథీలో ఓటమిని చవిచూశారు.అయితే, వయనాడ్‌ నుంచి ఘనవిజయం సాధించారు.రాయబరేలి నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న సోనియాగాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు.దీంతో అటు వయనాడ్‌తో పాటు ఇటు రాయబరేలి నుంచి కూడా వ్యూహాత్మకంగా రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అందుకు తగ్గట్టే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ రాహుల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి రావడంతో కాంగ్రెస్ సోమవారంనాడు మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వయనాడ్‌ సీటును రాహుల్‌ వదులుకోవడం ద్వారా అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని, ప్రియాంకను తిరిగి గెలిపించడం ద్వారా రెండు సీట్లు తమకు చాలా కీలకమనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.

ప్రియాంక భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం కేసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.
ఉపఎన్నికల్లో వయనాడ్ నుండి ప్రియాంక గాంధీను పోటీలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునట్టు అయిన తెలిపారు.పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో అందరూ సంతోషంగా ఉన్నారని అయిన తెలిపారు.కేరళ రాష్ట్ర ప్రజలకు ప్రియాంక గాంధీ అంటే చాలా ఇష్టమని,ఆమె భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS