Monday, November 4, 2024
spot_img

రాజ్యాంగం కాపీతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ

Must Read
  • రెండో రోజు కొనసాగిన 18వ లోక్ సభ సమావేశాలు
  • సమావేశంలో ఆందోళన చేసిన ఇండియా కూటమి ఎంపీలు
  • రాజ్యాంగ ప్రతులతో ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ
  • రాహుల్ ని ఫాలో అయిన మిగితా సభ్యులు

ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.జూన్ 24 ( సోమవారం ) తొలి లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తొలిరోజు ప్రధాని నరేంద్ర మోదీ,280 మంది ఎంపీలు లోక్ సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.ప్రోటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.ఇక రెండో రోజు మిగిలిన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.అయితే మంగళవారం జరిగిన సమావేశాల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.విపక్షాల ఆందోళన మధ్య లోక్ సభ సమావేశాలు జరిగాయి.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతులతో ప్రమాణస్వీకారం చేశారు.ప్రమాణం చేసే ముందు రాహుల్ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ప్రదర్శన చేశారు.అనంతరం ప్రోటెం స్పీకర్ రాహుల్ తో ప్రమాణం చేయించారు.కూటమి పార్టీల సభ్యులంతా చేతిలో రాజ్యాంగ ప్రతులతో ప్రమాణస్వీకారం చేశారు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS