Monday, November 4, 2024
spot_img

ఏపీ కి కేంద్రం ట్యాక్స్ నిధుల చెల్లింపు

Must Read


ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసిన కేంద్రం

  • ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి.
  • గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది.
  • ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  • ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ ఇచ్చింది.

వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూన్‌ నెలలో ట్యాక్స్ డెవల్యూషన్‌లో భాగంగా విడుదల చేసిన నిధులు ఇవి. అదనంగా మరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను కూడా కేంద్రం ఇందులో జమ చేసింది. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మూల ధన వ్యయాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది.

ఏపీ సహా మిగిలిన రాష్ట్రాలన్నింటికీ కలిపి 1,39,750 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం 12,19,783 కోట్లు. ఇందులో భాగంగా ఈ నిధులు విడుదల అయ్యాయి.

ఏపీ వాటాగా 5,655.72 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్- రూ.2,455.44, అస్సాం- రూ. 4,371.38, బిహార్- రూ. 14,056.12, ఛత్తీస్‌గఢ్- రూ. 4,761.30, గోవా- 539.42, గుజరాత్- 4,860.56, హర్యానా- 1,527.48, హిమాచల్ ప్రదేశ్- రూ. 1,159.92 కోట్లు విడుదల అయ్యాయి.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS