Sunday, June 15, 2025
spot_img

సిరియా అధ్యక్షుడి విమానం కూల్చివేత..?

Must Read

సాయుధ తిరుగుబాటుదారుల కారణంగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ ఆ దేశ రాజధాని వీడిచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అయిన ప్రయాణిస్తున్న విమానాన్ని తిరుబాటుదారులు కూల్చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసద్ ప్రయాణిస్తున్న ఐఎల్- 76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుండి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్‎సైట్ల సమాచారం చెబుతున్నట్లు ఈజిప్ట్ రచయిత ఖలీద్ మహమూద్ ట్విటర్‎లో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

సిరియాలో తిరుగుబాటుదారులు మళ్ళీ రెచ్చిపోయారు. ఇప్పటికే అనేక నగరాలను, పట్టణాలను తమ అధీనంలోకి తీసుకున్న తిరుగుబాటుదారులు తాజాగా రాజధాని డమాస్కస్‎ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బలగాల నుండి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో రాజధానిని వారు ఆక్రమించుకున్నారు.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS