Thursday, November 28, 2024
spot_img

మంచినీటి మాఫియా..!!

Must Read
  • నగరంలో జలం బంగారం
  • అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు
  • భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు..

జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంచినీటి మాఫియా మూడు సీసాలు..ఆరు క్యాన్లుగా వర్ధిల్లుతోంది. పాలకుల నిర్లక్ష్యం..అధికారుల్లో కొరవడిన ముందుచూపు..అంతకుమించి సర్కారులో రాజ్యమేలుతున్న అవినీతి, రాజధాని నగరంలో జలాన్ని బంగారం చేసింది. సాధారణ రోజుల్లోనే నెలకు కోట్లల్లో సాగే మంచినీటి వ్యాపారం ఇక పేండ్లి, వేసవి సీజన్‌లో వారి వ్యాపారం రూ.100కోట్లకు పైగా లావాదేవిలకు పడగలేత్తుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు పలు మార్గాల్లో చేరుతున్న మంచినీటిలో అక్రమార్కులు ఏమేర ఆదాయాన్ని పండిరచుకుంటున్నారో వివరించేందుకు ఆదాబ్‌ పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం.

నగరంలో జలం బంగారం :

హైదరాబాద్ నగర వాసులకు మంచినీటి కొరత లేకుండా జలమండలి శాఖ దాదాపు 570 మిలియన్‌ గ్యాలన్ల పైనే నీరు సరఫరా చేస్తుంది. దీనిని పక్కనా పెట్టిన, నీటి కోరత అధికారికంగా రోజుకు 50 నుంచి 10 మిలియన్‌ గ్యాలన్ల మేరు ఉంది. ఇక అంతర్జాతీయ నగరానికి రాకపోకలు గణనీయంగా ఉండటంతో, నీటి అవసరాలు అంచానాలకు కూడా చిక్కవు. దీంతో జనం భూగర్భజలాలపైనే ఆధారాపడాల్సిన పరిస్థితి. దీనిని అసరగా చేసుకుని ప్రైవేటు నీటి వ్యాపారులు ఇష్టానుసారంగా బోర్లు వేసి పాతళంలోని నీటిని పైకిలాగేసి..సోమ్ము చేసుకుంటున్నారు. జలమండలి సరఫరాలో కలుషితజలాలు తరచూ తెరపైకోస్తుండటంతో ప్రజలు చాలా మంది ప్రైవేట్ నీటి ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలో ఏగల్లికి చూసిన వాటర్‌ ప్లాంట్లు అనధికారికంగా కనిపిస్తాయి. దీంతో సౌత్‌ ఈస్ట్‌ టాస్క్‎ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, చాంద్రాయణగుట్ట సంతోష్‌నగర్‌ ప్రాంతాలో పలు ప్లాంట్లలో తనిఖీలు చేశారు.

జలదోపిడి..నెలకు ఆదాయం కోటి :

హైదరాబాద్‌ మహానగరంలో అత్యవసర సమయాల్లో మంచినీటిని అందించేందుకు జలమండలి ఉచిత ట్యాకర్లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తుంది. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఫిలింగ్‌ పాయింట్‌ ద్వారా నీటిని సరఫరా చేసేవారు. మరో పక్కా డోమేస్టిక్‌, కమర్షియల్‌, ధరకు కూడా మంచీనీటి విక్రయించేవారు. వీటి వల్ల కూడా వారికి ఆదాయం రాలేదు.

మినరల్ వాటర్‌ పేరుతో :

హైదరాబాద్‌ భాగ్యనగరంలో రోజువారీ కూలీకి వెళ్లే వారి నుంచి, సంపన్నుల వరకు జలమండలి నీటిపై నమ్మకం లేకపోవడంతో మినరల్ వాటర్‌ అయితేగాని గోంతులోకి దిగని దుస్థితి. మరోవైపు గడప దాటితే, హోటల్స్ లో, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో నీటిని తాగేందుకు జనం వెనుకంజ వేస్తున్నారు. దీంతో ప్రైవేట్ వ్యాపారం చేసేవారు, ప్యాకేట్లు, బాటిళ్ల రూపంలో దోచుకునేందుకు సిద్ధం అయ్యారు. తాగు నీటి ప్రాజెక్ట్‎లను పూర్తి చేయడం కోసం, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి, మరిన్ని కోట్లను నిర్వహాణ కింద ఖర్చు చేస్తున్నారు. అయినా జలమండలికి అనుకునంతగా ఆదాయం రావడంలేదని అధికారులే వాపోతున్నారు. పాతనగరంతో పాటు కొత్త నగరంలో కూడా ఆక్రమ నల్లా కనెక్షన్స్ జలమండలి ఆదాయం తగ్గుదలకు కారణం. దీనికి తోడు అన్నట్లు నగరంలో వెలుస్తున్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, టర్నోవర్‌ మాత్రం నెలకు రూ. 100 కోట్ల వరకు ఉంటుంది. ఒక సాధారణ కుటుంబలో కనీసంగా రెండ్రోజులకు ఒక క్యాన్‌ చోప్నున వినియోగించిన 20 లీటర్ల క్యాన్‌కు రూ.30.చోప్పున అంటే నెలకు ఆ కుటుంబం రూ.450 కేవలం తాగునీటికి ఖర్చు చేయాల్సిందే. ఇన్ని పైసలు ఖర్చు చేసిన మినరల్ వాటర్ ప్యాకేట్లు, బాటిల్స్ లోని నీళ్లు ఎంత మేరకు సురక్షీతం అనేది కూడ అనుమానమే.

నిబంధనలివి :

భారతీయ ప్రమాణాల సంస్థ (బీఎస్‌ఐ) నిబంధనల మేరకు వాటర్‌ ప్లాంట్‌ నెలకొల్పలంటే రూ.15లక్షలు వరకు పెట్టుబడి కావాలి. యంత్రాలు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, మైక్రో బయాలజిస్టులు ఉండాలి. ప్రతి మూడు నెలలకోసారి బీఐఎస్‌, నిపుణులు ఆయా ప్లాంటులో నీటి నమూనాలను సేకరించి 60 రకాల పరిక్షలు నిర్వహిస్తారు. సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌ ఇవ్వడంగాని, కొనసాగించడంగాని చేస్తారు. ప్లాంట్ల నిర్వహాణతో పాటు ప్యాకేట్లు, బాటిల్స్‌ విక్రయానికి కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లేబుళ్లపై లైసెన్స్‌ నెంబరు ఇతరత్రా వివరాలు ఉండాలి.

జరుగుతుంది ఇది :

రూ.2.3 లక్షలు వెచ్చించి ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. క్యాన్లకు, బాటిళ్లకు వివిధ పేర్లతో లేబుళ్లను అతికించి విక్రయిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. లేబుళ్లపై వివరాలు ఐఎస్‌ఐ మార్కులు కూడా ముద్రిస్తున్నారు. కాని లైసేన్స్‌ నెంబర్లు, అధికారిక వివరాలను ప్రదర్శించడంలేదు. పారిశ్రామికవాడల్లో భూగర్భజలాలు కలుషితమైనప్పటికి, ఆ నీటిని సైతం మినరల్‌ వాటర్‌గా విక్రయిస్తున్నారు. చాలా ప్లాంటు చెరువులు, కుంటలు, మూసి పక్కన బోర్లు వేసి కొనసాగిస్తున్నారు. ఇక ఏకంగా జలమండలి నీటిని డబ్బాల్లో నింపి విక్రయిస్తున్న ఘనులు కూడా ఉన్నారు.

నీటి పిపాసులు..భలేమంచి బేరం :

నగరంలో లాభసాటి వ్యాపారాల్లో మంచినీటి వ్యాపారం కూడా చెరిపోయింది. వంద గజాల స్థలం ఉన్నా అది లేకుంటే కాస్త ఖద్దరు చోక్కా ధరించి హాల్‌చల్‌ చేసే మనస్థతత్వం ఉన్నా.. నెలకు లక్షల్లో ఆర్జించే సులువైన మార్గంగా ఇది మారింది. ప్రభుత్వ వ్యవస్థలు చేతులెత్తేయడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు నీటి ట్యాంకర్ల హావా జోరుగా కొనసాగుతుంది. వాల్టా చట్టానికి తూట్లు పోడుస్తూ అక్రమార్కులు, ఇష్టానుసారంగా బోర్లు వేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించడం అనవాయితీగా మారింది. అందుకే..శివారు ప్రాంతాలు గ్రేటర్‌లో విలనం అనంతరం నీటి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఇది జలమండల సిబ్బందికి వరంగా మారింది. ట్యాంకర్లు,బోర్లు,ప్లాంట్లు..ఇదే కాదు..అధికారికంగా చేసిన పైపులైను ద్వారా కూడా నగరంలో నీటి చౌర్యం కొనసాగుతుంది. దీనికి పాతబస్తీ మినయింపు కాదు. ఇందులో ఇతరులతో పాటు జలమండల అధికారులప్రధాన పాత్రదారులుగా ఉన్నారు.

ఫిర్యాదు చేయండిలా :

ప్రమాణాలు పాటించని సంస్థలపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ పుడ్‌ అడల్ట్రేషన్‌ యాక్ట్‌ 1954 చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి. మూడు నెలలకోసారి ప్లాంటును బీఐఎస్‌ సంస్థ తనిఖీ చేసి గుర్తింపులేని వాటిని సీజ్‌ చేయాలి. కానీ నగరంలో అలా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇలాంటి సమయాల్లో పౌరులు మేల్కోని ఐఎస్‌ఐ మార్కు ఉండి కూడా నీరు కలుషితంగా ఉండని భావిస్తే, బాటిల్‌కు అతికించిన బ్యాచ్‌ లేబుల్‌ బాటిల్‌ను భద్రపరిచి బిఎస్‌ఐ ప్రధాన కార్యలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో అధికారి దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Latest News

తదుపరి మహారాష్ట్ర సీఎం పడ్నవీసేనా? ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS