సిరియా దేశ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్‌తో పాటు అయిన కుటుంబసభ్యులకు మానవతా దృక్పధంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కాస్ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్- అల్- అసద్ దేశాన్ని విడిచివెళ్లిపోయారు. ఈ క్రమంలో అయిన విమాన ప్రమాదంలో చనిపోయారనే వార్తలు సైతం చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో అసద్ రష్యాలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.