Friday, July 4, 2025
spot_img

ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరగాలి

Must Read
  • అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ముఖ్యమంత్రి అనేక సూచనలు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా, అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని అన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS