Wednesday, June 18, 2025
spot_img

గ‌*జాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Must Read

బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గ‌*జాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నిషేదిత గ‌*జాయి వ్యాపారం చేస్తూ గతంలో మీర్‎పేట్ పోలీసులకు, సరూర్‎నగర్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినప్పటికీ అతడు మళ్ళి గ‌*జాయి విక్రయించడం ప్రారంభించాడు పక్క సమాచారం మేరకు శ్రీనివాస్ గ‌*జాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకోని అతని నుండి 48 గ్రా గ‌*జాయి స్వాధీనం చేసుకొని నిందితుడిపై వివిధ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించామని తెలిపారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS