Friday, October 3, 2025
spot_img

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 02 వాయిదా

Must Read
  • ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
  • బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు
  • అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది
  • నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్.శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గ్రూప్ 02 పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేసిందని తెలిపారు.ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని పేర్కొన్నారు.డీఎస్సి,గ్రూప్స్ పరీక్షల మధ్య వ్యవధి కావాలని నిరుద్యోగులు కోరగా,ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రూప్ 02 వాయిదా వేసి వారికీ అవకాశం కల్పించిందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు మెడ శ్రీను, వినయ్,ఓయూ జాక్ నేత రాజేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This