Wednesday, June 18, 2025
spot_img

తెలంగాణ దేశానికి రోల్ మెడల్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Must Read

అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు.
సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు.
తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.
దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలిపింది బిఆర్ఎస్ పార్టీ.

తొమ్మిదేళ్ళ కాలంలో…

  • వ్యవసాయాన్ని పండుగ చేసింది.
  • విద్యుత్ రంగాన్ని పటిష్ఠం చేసింది.
  • విద్యా రంగాన్ని ఆదర్శంగా నిలిపింది.
  • వైద్య రంగాన్ని అగ్రస్థానానికి చేర్చింది.
  • పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
  • కరువుల బాధలు లేకుండా చేసింది
  • వలసలు వాపస్ తెచ్చింది.
  • పంట పొలాలను సస్యశ్యామలం చేసింది.
  • ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చేసి
  • ‘శభాష్ తెలంగాణ’ అని దేశం మెచ్చుకునేలా చేసింది.

ఈ అభివృద్ధి, ఉద్యమ స్ఫూర్తి ఇక మీదట కూడా ఉండాలని, తెలంగాణ దేశానికి రోల్ మెడల్ గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు.

జోహార్ తెలంగాణ అమరవీరులకు
జోహార్.. జోహార్..
జై తెలంగాణ

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS