Monday, October 20, 2025
spot_img

విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గం

Must Read

సీఎం రేవంత్ రెడ్డి

శాంతి,కరుణ,సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆరాంఘర్‎లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన “ప్రోఫేట్ ఫర్ ది వరల్డ్” పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రవక్త బోధనలైనా,భగవద్గీత,బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని,విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని తెలిపారు.ముహమ్మద్ ప్రవక్త బోధనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు.విద్వేష భావనల నుంచి దేశాన్ని,పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ఆచరణీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,తదితరులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This