Thursday, December 12, 2024
spot_img

పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు

Must Read
  • త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం
  • గిరిజన సంక్షేమ శాఖకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తాం
  • సక్సెస్‎గా దూసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వం
  • ఆటంకాలు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం
  • గత పదేళ్లలో తెలంగాణ 70 ఏళ్లు వెనక్కి వెళ్లింది
  • ప్రజావాణికి ఏడాది పూర్తి..ఎన్నో సమస్యలు పరిష్కరించాం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలోని పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు అందించనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొలి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో పోడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా పట్టాలు పొందిన పోడు రైతులు సాగు చేసుకోవడానికి సోలార్ ద్వారా ప్రతి వ్యవసాయం పంపు సెట్ కు కరెంటు అందించడానికి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు. పోడు రైతులు సోలార్ పవర్ పెట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని మరో రెండు మూడు రోజుల్లో గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ పాలనలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఏడాది పూర్తయింది. మహాత్మ జోతిబాపూలే ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమ లబ్దిదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణిని కంటిన్యూ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజావాణి కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 70 ఏళ్లు వెనక్కి పోయిందని.. భట్టి విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని భట్టి వివరించారు. అధికారంలో వచ్చిన వెంటనే ప్రజావాణి ఏర్పాటు చేశామని.. నిరంతర పర్యవేక్షణతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతుందని భట్టి అన్నారు. ఆదిలాబాద్ లో పోడు భూముల పట్టాలకు పరిష్కారం తమ ప్రభుత్వం చూపిందన్నారు.

అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి సోలార్ పవర్ ఇస్తాం అని భట్టి పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం తమ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజావాణి మొదలై నేటికీ ఏడాది పూర్తయింది. ఏడాది కాలం లో అనేక సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజావాణి..ఎన్నో సంవత్సరాలుగా పెండిరగ్లో సమస్యలకు పరిష్కారం చూపింది. ఏ శాఖలో సమస్య ఉన్న ప్రజావాణి పరిష్కారం చూపుతుందన్నారు. ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజావాణి ద్వారా సంబంధిత హాస్పటల్ కి పంపి చికిత్స చేసుకోవచ్చన్నారు. స్కాలర్షిప్ సమస్యలను ప్రజావాణి తీర్చిందని భట్టి తెలిపారు. గల్ఫ్ కార్మిక బాధితులకు ప్రజావాణి ద్వారా సహాయం అందిందన్నారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS