Friday, December 13, 2024
spot_img

నేర చరిత్ర ఉందని నిరుపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా

Must Read

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన విమర్శల పై జగదీష్ రెడ్డి స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,తన నేర చరిత్ర నిజమని నిరుపిస్తే ఇదే సభలో ముక్కు నెలకు రాసి ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తానని,నిరూపించకపోతే కోమటి రెడ్డి వెంకటరెడ్డి తో సహా సీఎం రేవంత్ రెడ్డి తమ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమం తప్ప తన పై వేరే కేసులు లేవని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS