- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఆదివారం బోనాల ఉత్సవాల సంధర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గత సంవత్సరం వర్షాలు లేవని,ఈసారి వర్షాలు బాగా పడలని,పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు.బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ది కోసం భారీగా నిధులు కేటాయించమని వెల్లడించారు.