Saturday, December 14, 2024
spot_img

కాంగ్రెస్ లోకి తలసాని.?

Must Read

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి
అఖిలేష్ యాదవ్ ద్వారా రికమండ్
ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులు
త్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్
కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ ఫుకార్లు
హస్తం గూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిక
అదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం
గాంధీ భవన్ గేట్లు కుళ్లా ఉన్నాయన్న దీపాదాస్ మున్షి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముగిసినందున అధికార కాంగ్రెస్ లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు శాసనసభ్యులు హస్తం గూటికి చేరిపోయారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతున్నరన్న ప్రచారం జోరుగా సాగుతుంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో రికమండ్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ సైతం రంగంలోకి దిగి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ తో రాయబారం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాగం నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీ మారబోతున్నారని ప్రచారంపై ఆసక్తి నెలకొంది. అన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆయన కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

మరోవైపు గతంలో రేవంత్, తలసాని టీడీపీలో ఉండగా పనిచేశారు. వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లోని నేతలను తొలుత పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని కాంగ్రెస్ లోకి చేరతారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా.. తలసానికి మంత్రి బెర్త్ కూడా కన్ఫామ్ అయిపోయిందని నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది. కాగా ఈ పుకార్లపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆయన పార్టీ మారే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాంధీ భవన్ గేట్లు కుళ్లా:


అధికార కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ఎవరికైనా ఆహ్వానం ఉందని ఆ పార్టీ అగ్రనేతలు బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్ర పార్టీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షి ఇటీవల ఈ మేరకు ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల సైతం హస్తం గూటికి చేరేందుకు ఆసక్తి ఉంటే గాంధీ భవన్ గేట్లు ఓపెన్ ఉన్నాయని ఎవరూ, ఎప్పుడైనా రావొచ్చంటూ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చెయ్యి గుర్తు పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. గవర్నమెంట్ లో ఉన్న హస్తం పార్టీలో చేరితే నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చనే ఆశతో జాయిన్ అవుతున్నట్లు గులాబీ లీడర్లు బహిరంగంగానే చెబుతున్నారు.

కానీ ఇటీవల మాత్రం పక్కా.. వ్యతిరేకమైన పార్టీలలో ఉండటం వల్ల పలుమార్లు విమర్శలు సైతం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణకు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికపైన కూడా కొంత మంది నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదీలా ఉండగా తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా బీఆర్ఎస్ నుండి వరుసగా ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ బాట పట్టడంతో కాంగ్రెస్ లో అప్పటికే ఉన్న నేతల్లో అసహనం నెలకొంటుంది. బీఆర్ఎస్ నేతలను వరుసగా చేర్చుకోవడంపై ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్ లీడర్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేడు హస్తం గూటికి చేరుతుండడాన్ని నేతలు తట్టుకోలేకపోతున్నారు.

మొత్తంగా త్వరలో కారు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పదేళ్లు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పతార ఇంతగా తగ్గిపోతుంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు. స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగి పార్టీనుంచి జారీపోయే వారినీ బుజ్జగించినా వినడం లేదంటే కారు గుర్తు పార్టీ పరిస్థితి రాను రాను ఏమవుద్దో అర్థం కానీ పరిస్థితి. అధికారంలో ఉన్నంత సేపు కేసీఆర్ కు అంటకాగిన నేతలంతా కల్వకుంట్ల ఫ్యామిలీ ఒంటరి చేసి పోతుంటే గులాబీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. త్వరలో ఇంకేంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతారో చూడాలి మరీ.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS